పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలి

కాగజ్‌నగర్‌, న్యూస్‌టుడే: 0-5 సంవత్సరాల ప్రతి చిన్నారికి తప్పకుండా పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య కోరారు. ఆదివారం స్థానిక పీహెచ్‌సీలో చిన్నారులకు పోలియో చుక్కలను వేసి ప్రారంభించారు. క్లస్టర్‌ అధికారిణి. డాక్టర్‌ రేఖ మాట్లాడుతూ కాగజ్‌నగర్‌ పట్టణంలో 55 కేంద్రాలను ఏర్పాటు చేసి 9235పిల్లలకు, మండలంలో 34కేంద్రాలు ఏర్పాటు చేసి 3807 మంది చిన్నారులకు చుక్కలు వేయనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌సీ డాక్టర్‌ సుచిత్ర, హెచ్‌ఈవో హైజాక్‌, పురపాలక సంఘం మేనేజర్‌ బాపు. ఇన్ఛార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.