పశువుల పాక గా మారిన అంగన్ వాడి కేంద్రం

జులై 9 (జనం సాక్షి )చిన్న పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు మానసిక వికాసం పౌష్టికాహారం కోసం గ్రామాలలో అంగన్వాడి కేంద్రం పనిచేస్తుంటాయి. వీటికి సొంత భవనం మంజూరు చేసిన ఏళ్ల తరబడి పనులు జరగకపోవడంతో అర్ధాంతరంగా పనులు నిలిచాయి. చింతపల్లి ఐ సి డి ఎస్ ప్రాజెక్టు పరిధిలోని,నాంపల్లి మండలం లోని మెల్లవాయి గ్రామంలో అంగన్వాడి కేంద్రం సొంత భవనం నిర్మాణం కోసం సుమారు 8 లక్షల రూపాయలు గతంలో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆ సమయంలో పనులు కొంతమేరకు జరిగాయి. భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో, అంగన్ వాడి కేంద్రాలు చాలీచాలని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో బాలింతలు, గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్ వాడి కేంద్రం పూర్తి కాకపోవడంతో అందులో పశువులను, గేదెలకు అడ్డగామారి, పశువుల కొట్టం గా మారుతుందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని అంగన్వాడి కేంద్రాన్ని పూర్తిచేయాలని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు

తాజావార్తలు