పసుపు బోర్డు ఏర్పాటుకు డిమాండ్
నిజామాబాద్,మే7(జనంసాక్షి): పసుపు బోర్డు ఏర్పాటుతోనే రైతుల కష్టాలు తీరుతాయని రైతులు అంటున్నారు. రెండేళ్లయినా దీనిపై చలనం లేదన్నారు. బోర్డు ఏర్పాటుకు ఎంపి కవిత పోరాడినా ఫలితం లేకుండా పోయింది. తమకు పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదన్నారు. గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతున్నారని, దీనికితోడు పంటను అమ్ముకోడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి రావడంతో వారు మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర పంటల మాదిరిగా పసుపునకు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. నిజామాబాద్ వ్యవసాయ పాలక మండలి ప్రతినిధులను కలిసి కొనుగోళ్లను త్వరితగతిన చేప్టటాలని కోరారు.