పాకాలను సందర్శించిన ఇండియన్ అడ్వెంచర్ రైడర్స్ బృందం,
*ప్రకృతి బాగుంటేనే మానవ శైలి బాగుంటుంది,
*ప్రకృతిని కాపాడుకునేందుకు మన వంతు సహకారం అందించాలి,
ఖానాపురం అక్టోబర్2జనం సాక్షి
మండలంలోని పాకాల సరస్సు తో పాటు పర్యావరణాన్ని ఆదివారం ఇండియన్ అడ్వెంచర్ రైడర్స్ బృందం సందర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా వారు ఒక బైకింగ్ కమ్యూనిటీ అని తెలిపారు. హైదరాబాదు నుండి పాకాల బయోడైవర్సిటీ, పాకాల అందచందా సందర్శించడానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ హైదరాబాదులో ఉన్న చాలామంది కి పాకాల డైవర్సిటీ గురించి తెలియక అందరూ పబ్బులకు,టూర్లకు వెళుతూ ఉంటారని అన్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకు దాని అభివృద్ధికై మన వంతు సహకారం అందించాలని అన్నారు. ప్రకృతి బాగుంటేనే మానవ శైలి బాగుంటుందని అన్నారు. చెట్లను నరుకుతూ, జంతువులను చంపేస్తూ ముందుకు వెళితే మానవ జీవనశైలికి రానున్న తరానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. ప్రస్తుత కాలంలో ఆక్సిజన్ తక్కువై పొల్యూషన్ రేటు ఎక్కువ పెరగడం వలన మానవజాతి అనేక వ్యాధుల పాలు అవుతున్నారని దానికి కారణం సరియైన పర్యావరణం లేకపోవడమే అని తెలిపారు. మొక్కల్ని మనం కాపాడితే రానున్న కాలంలో మనల్ని మొక్కలు ఆక్సిజన్ ఇచ్చి కాపాడతాయని అన్నారు. పాకాల పర్యావరణం, చుట్టూ ఉన్న అభయారాన్ని ఆస్వాదించడానికి వచ్చారని తెలిపారు. అటవీ శాఖ అధికారులు మమ్మల్ని గౌరవగా స్వాగతించారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్,డి ఆర్ ఓ మోహన్, ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.