పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

1

– పంజాబ్‌ హోంమంత్రితో సహా 12 మంది మృతి

హైదరాబాద్‌ ఆగష్టు 16 (జనంసాక్షి):

పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో ఉగ్రవాదులు ఆదివారం ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పంజాబ్‌ రాష్ట్ర ¬ంమంత్రితో సహా 12 మంది మృతి చెందారు. పంజాబ్‌లోని షాదిఖెల్‌ గ్రామంలో ¬ంమంత్రి తన నివాసంలో జిగ్రా(స్థానికులతో సమావేశం) నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సుమారు వంద మంది హాజరైనట్లు సమచారం. అదే సమయంలో ఉగ్రవాదులు లోనికి ప్రవేశించి ఆత్మాహతి దాడికి పాల్పడ్డారు. సమావేశం జరుగుతున్న గది గోడ సమీపంలో బాంబు పేలుడు సంభవించడంతో భవనం కూలిపోయింది. దీంతో ¬ంమంత్రి ష్ళజా ఖాన్‌జాదా సహా దాదాపు 30 మంది భవనంలో చిక్కుకుపోయారు. బాంబు దాడికి సమీపంలో ఉన్న భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ¬ంమంత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ¬ంమంత్రితో సహా డీఎస్పీ శౌఖత్‌ షా కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ఐదు మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఖాన్‌జాదా గతేడాది అక్టోబర్‌లో పంజాబ్‌ ¬ంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పంజాబ్‌లో తీవ్రవాదాన్ని అంతమొందించే ప్రయత్నాల్లో ఖాన్‌జాదా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే అల్‌ఖైదా పంజాబ్‌ చీఫ్‌, తన అనుచరులు ఓ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు ఖాన్‌జాద్‌ ప్రకటించారు. అప్పటి నుంచి ఖాన్‌జాద్‌కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.