పాక్‌ పట్ల ప్రపంచంలో వ్యతిరేకత: మాణిక్యాల రావు 

ఏలూరు,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   మనదేశంలో దాడులకు పాల్పడితే తగిన బుద్ది చెబుతామని మోడీ సర్కార్‌ పాక్‌కు గట్టి హెచ్చరిక చేసిందని మాజీమంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు అన్నారు. ఐరాసలో మోడీ ప్రసంగం తరవాత పాకిస్థాన్‌ తీరును ప్రపంచం ఎండగడుతోందని అన్నారు. దేశంలో ప్రతీ ఒక్కరూ మోడీ తీసుకున్న నిర్ణయాలకు గర్విస్తున్నారన్నారు. పాక్‌ తటపటాయించడం చూస్తుంటే ఉగ్రమూకలకు ఏ విధంగా అండగా ఉందో తెలుసుకోవచ్చన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ ¬దాను కల్పించి, పనులు పూర్తి చేసేందుకు ప్యాకేజీలో 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. భారతీయ జనతా పార్టీని బూత్‌స్థాయిలో బలోపేతం చేయాలని, కేంద్ర సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.  పార్టీ ద్వారా చేపట్టే కార్యక్రమాలను మరింత విస్తృతం
చేయాలన్నారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలంతా పార్టీ కోసం పనిచేయాలన్నారు.