పాజిటివ్ టాక్‌లో సాయిపల్లవి గార్గి
నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దక్షిణాదిన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటి సాయి పల్లవి. గ్లామర్‌కు అతీతంగా నటనకు ఆస్కారమున్న పాత్రలను పోషిస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ టైర్2 హీరోలకున్నంత క్రేజ్ ఉంది. ఇటీవలే ఈమె నటించిన ’గార్గి’ విడుదలై ఘన విజయం సాధించింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఎలాంటి అంచనాల్లేకుండా జూలై 15న విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయం సాధించింది. మహిళా ప్రధానంగా సాగిన ఈ చిత్రంలో సాయిపల్లవి నటన వర్ణనాతీతం. కమర్షియల్ గానూ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇప్పటివరకు ఈ చిత్రం దాదాపు 13కోట్లను కలెక్ట్ చేసింది. సాయిపల్లవికి ఉన్న క్రేజ్‌తో ఈ చిత్రానికి 5కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సాయిపల్లవి మార్కెట్‌కు ఇది ఎక్కువే అని చెప్పాలి. అయితే ఈ చిత్రం వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుని లాభాల బాట పట్టింది. ఈ మధ్య చాలా వరకు సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. ఈ క్రమంలో సాయిపల్లవి నటించిన గార్గి ఈ స్థాయిలో హిట్టయిందంటే విశేషం అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా దగ్గుబాటి విడుదల చేశాడు. తెలుగులో ఈ చిత్రం కోటీన్నరకు పైగా షేర్‌ను సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.