‘పాట్నా ఛాత్ పూజలో తొక్కిసలాట-14మంది మృతి
పాట్నా: నవంబర్ 19(జనంసాక్షి):
ఛత్ పూజ సందర్భంగా పాట్నాలోని గంగాఘూట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14మంది మరణించారు. ఉత్తరాది రాష్ట్రలలో ముఖ్యంగా బీహార్‌లో ఈ పూజను ఘనంగా జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాలలో తక్కువ. సూర్యభగవానుని ప్రార్థించి తమకు పంటలు సరిగా పండాలని, ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆయనను ప్రార్థిస్తారు. ప్రకృతి ఆరాధికులైన ఆర్యులనుంచి ఈ పూజ క్రమంగా ఉత్తరాదిలో వ్యాప్తి చెందింది. గంగాఘాట్ వద్ద లక్షలాది మంది నదీ స్నానాలు చేశారు. దేశం మొత్తం మీదా వివిధ ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్న బీహారీలు ఈ పూజ సందర్భంగా స్వస్థలాలకు చేరుకుంటారు. సోమవారం వేలాది మంది సూర్యునికి అర్ఘ్యం సమర్పించేందుకు ఒకేచోట ఎగపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులలో పలువురు మహిళలే. మృతుల సంఖ్య ఇంకా పెరిగే సూచనలున్నాయి.