పాఠశాలలో రేకుల షెడ్డు తయారీ

జనం సాక్షి కథలాపూర్
ఆ పాఠశాలలో వర్షం పడుతూ ఉంటే వంట చేయడానికి ఇబ్బందిగా ఉందని సర్పంచ్ గడిల గంగ ప్రసాద్ వెంటనే ఆలోచించి పాఠశాలకు వంటల గదికి రేకులతో షెడ్డు తయారు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గాడిల గంగ ప్రసాద్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ నుండి 16 రేకులు ఉచితంగా పాఠశాలకు అందించామని తెలిపారు. గ్రామంలో బడి బాగుంటేనే గ్రామం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విద్యార్థులు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ చాందు, ప్రసాద్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు