పాఠశాలల్లో మొక్కలు నాటాలి

చిత్తూరు,జూన్‌26(జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను అన్నివిధాలా తీర్చిదిద్దుతామని జిల్లా విద్‌ఆయశాఖాధికారులు అన్నారు. ప్రస్తుతం 12ఏళ్ల పిల్లలు సైతం ఎవరెస్టు శిఖరాలను అధిరోహిస్తున్నారని అన్నారు. గురుకుల పాఠశాలల విద్యార్థులు సైతం పట్టుదలతో చదవాలన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు రావలనుకునే వారికి ప్రోత్సాహం ఇప్పిస్తామని అన్నారు. పాఠశాల ఆవరణలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు .జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. మంచి వాతావరణంలో అత్యంత సుందరంగాఉన్న ఈ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.