పాఠశాల బస్సు, లారీ ఢీ.. ఇద్దరి మృతి
మహబూబ్‌నగర్ : మక్తల్ మండలం బొందల్‌కుంట స్టేజీ సమీపంలో ఈ ఉదయం పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పాఠశాల బస్సులోని ఓ విద్యార్థి, లారీ డ్రైవర్ మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.