*పాఠశాల విద్యార్థులపై పురుగులు పడి దద్దుర్లు*పట్టించుకోని అధికారులు
అక్టోబర్ 18 (జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలకు దీటుగా విద్యను అందించేందుకు కృషి చేస్తూ మాఊరు-మాబడి పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు నిధులు కేటాయించి నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటూఉంటే,అదే కాకుండా గత రెండు సంవత్సరాల క్రితం కరోన వ్యాధి విజృంభించి విద్యార్థులు విద్యకు దూరమై ప్రైవేటు పాఠశాలను వదిలి ప్రభుత్వ పాఠశాలల్లో చేరినప్పటికి వారికి ప్రభుత్వ పాఠశాలల్లో ఎదురయ్యే సమస్యలను పట్టించుకునే నాధుడే కరువయ్యారు ఇలాంటి సంఘటనే మండల పరిధిలోని పోట్లపహాడ్ ప్రాధమికొన్నత పాఠశాలో చోటుచేసుకుంది తల్లిదండ్రులు,విద్యార్థులు గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం పాఠశాలలో 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సుమారు 60నుండి 70 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుండగా గత కొన్ని రోజుల నుండి పాఠశాలలో శిథిలావస్థకు చేరిన బారి వృక్షాల నుండి కొమ్ము పురుగులు (చీదర పురుగులు) విద్యార్థులు మీద పడి విపరీతమైన దద్దుర్లు వచ్చి వ్యాధుల బారిన పడుతున్నారు పురుగులు పడగానే దద్దుర్లు రావడంతో ప్రతి సారి ఇంటికి వెళ్లి స్థానాలు ఆచారించి వస్తున్నారు ఇలా విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే సంబంధించిన అధికారులు గాని స్థానిక పాలకులు గాని పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన గురవుతున్నారు మంగళవారం పాఠశాల విద్యార్థులైన రెహనా,జినేత్ ఖాన్,శివ,సంతోష్ కుమార్,చంద్రశేఖర్ చంద్రబోస్,మణి కంట,జరీనా,రేవంత్ లతోపాటు పురుగుల ధాటికి గురై ఇబ్బందులు పడ్డారు ప్రతి సంవత్సర ఇదే తంతు కొనసాగుతుందని అయినప్పటికి ఎవరు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు పట్టించుకోని ఈసమస్యను పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు కోరుతున్నారు *ఈ సంఘటనపై ప్రధానోపాధ్యాయులు రేణుకను వివరణ కోరగా విద్యార్థులపై పురుగులు పడి దద్దుర్లు రావడం వాస్తవమేనని తాము మండల విద్యాధికారికి, స్థానిక సర్పంచ్,పాలకులకు తెలియజేశామని వారు రేపుమాపు అంటూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు*