పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలోని దూద్‌బౌలీలో దొరికిన విలువైన పాత నాణెళిలను పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. మొగల్‌, రోమన్‌ కాలంనాటి పాత నాణెళిలు, బంగారు ఆభరణాలు విక్రయించేందుకు ప్రయత్నించిన ఓ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాతబస్తలో ఓ ఇంటిని తవ్వగా ఇవి బయటపడ్డట్టు తెలుస్తోంది. వీటిని గుట్టుగా అమ్ముకునేందుకు ప్రయత్నించగా వ్యవహారం బిడిసి బయటకు వచ్చింది. వీటిని ముంబాయిలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న మహ్మద్‌ రఫీక్‌, అబ్దుల్‌ బారీ అనే ఇద్దరు వ్యక్తుల నుంచి సుమారు 7 కోట్ల విలువైన పురాతన బంగారు నాణెళిలు, ఆభరణాలు, నాలుగు కిలోల పైగా వెండి ఆభరణాలు పోలీసులు స్వాధీనం

చేసుకున్నారు. దూద్‌బౌలీలోని ఓ ఇంటిని తవ్వుతుండగా ఈ నాణెళిలు దొరికినట్లు తెలుస్తోంది. వీటి పంపకంలో జరిగిన వివాదంతో మొత్తం వ్యవహారం వెలుగుచూసింది. పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.