పాత్రికేయుడి పై దాడి ఖండించిన: ప్రెస్ క్లబ్ అధ్యక్షులు

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిదిలాంటి విలేకరిపై ఓ అధికారి దాడి చేయడం దారుణమని దంతాలపల్లి మండల జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు చిల్ల నిరంజన్ ముదిరాజ్ మండిపడ్డారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగారం మండలం చింతగూడెం గ్రామ పరిధిలో జరిగే పోడు భూముల సర్వేలో భాగంగా సోమవారం మన తెలంగాణ రిపోర్టర్ పల్లె సురేష్ పై ఫారెస్ట్ బీట్ అధికారి దాడి చేశారు. వార్త సేకరణ కోసం వెళ్లిన రిపోర్టర్ ను దురుసుగా మాట్లాడుతూ రిపోర్టర్ ఎవరైతే నాకేంటి అంటూ అధికారి రిపోర్టర్ పై ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ అంతటితో ఆగకుండా చేయి చేసుకోవడంతో సమయానికి వచ్చిన చింతగూడ గ్రామస్తులు ఫారెస్ట్ అధికారిని అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కోశాధికారి ఎర్రబోయిన మురళి, జింకి లాల్, విజయ్, ఐలేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.