పాదయాత్రలో రెచ్చగొట్టడమే పని

విపక్ష నేతగా విఫలమయిన జగన్‌

అసెంబ్లీకి రానప్పుడు విపక్షనేత ఎలా అవుతారు

వైకాపా తీరుపై మండిపడ్డ టిడిపి నేతలు

అమరావతి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): చంద్రబాబు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అంటూ పాదయాత్రలో ప్రజలను రెచ్చగొట్టాలని జగన్‌ చూస్తున్నారని అధికార టిడిపి మండిపడింది. అసెంబ్లీ పెడితే హజారు కాని అసమర్థనేత జగన్‌ అని ఆ పార్టీ నేతలు బుద్దా వెంకన్న,జివి ఆంజనేయులు తదితరలు అన్నారు. చంద్రబాబును విమర్శిస్తూ రాజకీయం చేయడం తప్ప వైకాపా తనకు తానుగా ప్రజల్లో ఆదరణ లేని పార్టీగా నిలిచిపోయిందని అన్నారు. ఎవరు మోసకారులో, ఎవరు అవినీతి పరులో అర్థం చేసుకోలేనంత అమాయకులు ప్రజలు కాదన్నారు. నవరత్నాలతో పాదయాత్రకు బయలుదేరిన జగన్‌ యాత్రలో వందలాది రత్నాలు ప్రకటిస్తున్నారు. లోటు బడ్జెట్‌తో కొట్టుమిట్టాడుతున్న కొత్త రాష్ట్రంలో జగన్‌ ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాల విలువ ఏటా రూ.5లక్షల కోట్లకు దాటిందన్నారు. వాటిని ఎలా సమకుర్చుతారన్న దానిపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే ఇంకా అనేక పథకాలు ప్రకటించడం ఎవర్ని మోసం చేయడానిని వారు ప్రశ్నించారు. ప్రత్యేక ¬దా విషయంలో కేంద్రాన్ని నిలదీయలేని జగన్‌ చంద్రబాబును టార్గెట్‌ చేసి విషం కక్కడాన్ని ప్రజలు హర్షించలేరని గుర్తుంచుకోవాలన్నారు. ఎంతసేపూ చంద్రబాబును దుమ్మెత్తి పోయడమే తప్ప, ప్రత్యేక ¬దాపై మాట మార్చిన ప్రధాని మోదీని ఒక్క మాట అనకుండా రాజకీయం నెరపాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీకి రాని వారిని ప్రతిపక్షనాయకుడు అనడానికి కూడా లేదన్నారు. 2019 ఎన్నికలు దగ్గర పడుతుండటంతో జగన్‌ అబద్ధాలతో ప్రజలనుఎ ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారని మండిపడ్డారు. సెంబ్లీని బహిష్కరించాలని తమ అధినేత జగన్‌ తీసుకొన్న నిర్ణయంతో ఆ పార్టీ ఎమ్మేల్యేలు కూడా ఆవేదనలో ఉన్నారని అన్నారు. ఇప్పటివరకు అసెంబ్లీలో తాను తప్ప మరో సభ్యుడిని మాట్లాడ

నివ్వలేని జగన్‌ ప్రజానాయకుడు ఎలా అవుతారని అన్నారు. అసెంబ్లీలో తమ సమస్యలు చర్చించమని ప్రజలు అసెంబ్లీకి పంపితే రాజకీయ కారణాలతో సభను బహిష్కరించడం అవివేకంకాక మరోటి కాదన్నారు. పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడం అన్నది జగన్‌ వైఫల్యమని, దాన్ని కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరోటి కాదన్నారు. ప్రజాసమస్యలు అంటూ పాదయాత్రలో కన్నీరు కార్చడం రాజకీయ ప్రయోజనాలకోసం అన్నది ప్రజలు బాగా అర్తం చేసుకుంటున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం, పట్టిసీమ, మచిలీపట్నం పోర్టు, భోగాపురం విమానాశ్రయం వంటి కార్యక్రమాలన్నిటినీ అడ్డుకుంటున్న అభివృద్ధి నిరోధకుడు జగన్‌ అని టిడిపి నేతలు దుయ్యబట్టారు. తండ్రి నామస్మరణ తప్ప మనుగడ లేని పార్టీ వైసిపి అన్నారు. తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎన్నో రకాలుగా అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తి జగన్‌ అన్నారు.ప్రతి శుక్రవారం పాదయాత్ర ఆపేసి కోర్టుకు వెళ్ళి బోనులో ఎందుకు నిలబడాల్సి వస్తుందో, ఈడీ తన ఆస్తులు ఎందుకు అటాచ్‌ చేసిందో.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పనంత కాలం ప్రజలు నమ్మరని అన్నారు. ప్రత్యేక ¬దా ఇవ్వమని చెప్పిన బిజెపితో చేయికలిపిన జగన్‌కి ప్రత్యేక ¬దాపై మాట్లాడే హక్కు ఎక్కడిదని టిడిపి నేతలు ప్రశ్నించారు. ప్రతిపక్షం నాలుగేళ్లుగా ఏ ఒక్క అంశంలోనూ సహకరించకుండా అన్నింటినీ అడ్డుకొనే ప్రయత్నం చేయడమే జగన్‌ రాజకీయంగా సాధించిన విజయమని ఎద్దేవా చేశారు.

తాజావార్తలు