పాన్‌ ఇండియా లెవల్లో గూఢచారి`2 సీక్వెల్‌

ప్రస్తుతం ’పాన్‌ ఇండియా’ ట్రెండ్‌ నడుస్తోంది. అగ్ర హీరోలకు ధీటుగా ఇటీవల యువహీరోల ఆలోచనలు
సాగుతున్నాయి. ఇదే కోవలో ట్యాలెంటెడ్‌ హీరో కం రైటర్‌ అడివి శేష్‌ భారీ ’పాన్‌ ఇండియా’ ప్రణాళికలతో దూసుకెళుతున్నాడు. ఇటీవలే ’మేజర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన శేష్‌ మరోసారి అలాంటి మ్యాజిక్‌ ని రిపీట్‌ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అతడు పాన్‌ ఇండియా స్క్రిప్ట్‌ లపై దృష్టి సారించాడు. మేజర్‌ తరహాలో హిందీ`తెలుగు పరిశ్రమలతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ మెప్పించే స్క్రిప్టులను సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మారిన ఇమేజ్‌ తో ఇకపై ప్రతిసారీ ఇరుగు పొరుగున ఆడియెన్‌ ని అతడు దృష్టిలో పెట్టుకోనున్నాడు. అదే క్రమంలో అతడు తన బ్లాక్‌ బస్టర్‌ ’గూఢచారి’ సీక్వెల్‌ పైనా దృష్టి సారించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్పై ఆపరేషన్‌ నేపథ్యంలో ఏ సినిమా తీసినా అది యూనివర్శ్‌ కి కనెక్టయ్యి ఉంటుంది. ప్రస్తుతం ఈ తరహా సినిమాల ట్రెండ్‌ జోరందుకుంది. ఇదే ఒరవడిలో శేష్‌ మరో పాన్‌ ఇండియా స్క్రిప్టునే ఎంపిక చేసుకుంటారని సమాచారం. గూఢచర్యం నేపథ్యంలో సత్తా చాటాలని కూడా అతడు గట్టిగా నిర్ణయించుకున్నట్టు గుసగుస వినిపిస్తోంది. గూఢచారి ఫ్రాంఛైజీకి చాలా మైలేజ్‌ ఉంది. దానిని కొనసాగిస్తాడని కూడా టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. హిట్‌ 2 ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌. ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. విూనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటించింది. వాల్‌ పోస్టర్‌ సినిమా ఫ్రాంచైజీ ఈ మూవీని నిర్మించింది. ఈ మూవీ నాన్‌`థియేట్రికల్‌ బిజినెస్‌ జోరుగా సాగిందని టాక్‌ ఉంది.