పాపికొండల పర్యటన యథాతథం
ఖమ్మం, జూన్ 27 : పాపికొండల పర్యాటకం యథాతథంగా కొనసాగించేందుకు భద్రాచలం ఉత్తర, దక్షిణ విభాగం డీఎఫ్‌వో అశోక్‌కుమార్ బుధవారం అనుమతించినట్లు భద్రాచలం టు పాపికొండల బోర్డు ఆపరేటర్ల వెల్‌ఫేర్ సోసైటీ అధ్యక్షుడు సి.హెచ్ సూర్యప్రకాశ్‌రావు తెలిపారు. గత కొద్ది రోజులుగా అటవీ అధికారులు పాపికొండల పర్యాటకాన్ని అడ్డుకున్న విషయం విదితమే ఈమేరకు భద్రాచలం డీఎఫ్‌వో అశోక్‌కుమార్, ఐటీడీఏటీవో ప్రవిణ్‌కుమార్, బోర్డు ఆపరేటర్ల సంఘం నాయకులు చర్చించిన అనంతరం వారి విజ్ఞప్తి మేరకు తిరిగి పాపికొండల పర్యాటకానికి అడ్డకంకులు తొలిగిపోయాయి. స్థానిక అటవీ శాఖాధికారి ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా పర్యటకులను అడ్డుకోవడంపై విమర్శలు వచ్చాయి. ఈ విషయంపై వైల్డ్‌లైఫ్ ఉన్నతాధికారులు ఐటీడీఏ అధికారులు, అటవీ అధికారులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై వైల్డ్‌లైఫ్ అధికారులు సమగ్ర విచారణకు ఆదేశాలు జరీ చేసినట్లు తెలిసింది.