పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం

పేదల కోసమే నగదు బదిలీ
మహిళా భద్రతకు రాజీలేదు
ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన ప్రణబ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21 (జనంసాక్షి): అన్ని సంక్షేమ పథకాల్లో ప్రభుత్వం పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తెలిపారు. నగదు బదిలీతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని పేర్కొన్నారు. రాయితీలు, ఇతర సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా కేంద్రం చర్యలు చేపట్టిందన్నారు. పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళా భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆహార భద్రతా, న్యాయ జవాబుదారీ బిల్లులకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 2013 నాటికి దేశాన్ని పోలియో రహితంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. చేనేత కార్మికులకు లబ్ధి చేకూర్చేందుకు రుణ మాఫీ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉన్నత విద్యా అభివృద్ధికి నూతనం పథకం అమలు చేస్తామన్నారు. హైదరాబా’ సహా ఆరుచోట్ల ఔషధ పరిశోధన సంస్థలు స్థాపించనున్నట్లు చెప్పారు. అసంఘటి రంగ కార్మికులకు జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఉత్పాదక రంగంలో ఉన్న పది కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా ఈ ఏడాదిలో భార’ కీలక ప్రయోగాలు చేపట్టున్నట్లు ప్రణబ్‌ చెప్పారు. ఈ సంవత్సరంలోనే అంగారకుడిపైకి తొలి ఉపగ్రహం పంపించనున్నట్లు తెలిపారు. అలాగే, తొలి నావిగేషనల్‌ శాటిలైట్‌ను ప్రయోగించనున్నట్లు వివరించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమ య్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రణబ్‌ ప్రసంగించారు. విపక్షాల ఆందోళనలు, నిరసనలను పట్టించుకోకుండా ఆయన ప్రసంగం ఏకధాటిగా కొనసాగింది. ప్రణబ్‌ ప్రసంగంలో నగదు బదిలీ పథకం, దేశ, మహిళా భద్రతా, ఆర్థిక పరిస్థితులు సహా అన్ని అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వ పనితీరు బాగుందని కితాబునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావం వల్ల వృద్ధి రేటు తగ్గుముఖం పట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోందని, పెట్టుబడులను ప్రోత్సహిస్తూ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు, ఆర్థిక వృద్ధికి కేంద్రం పలు చర్యలు చేపట్టిందని, పింఛన్లు, ఇతర సంక్షేమ రాయితీలన్నీ నేరుగా లబ్దిదారులకే అందేలా చర్యలు చేపట్టామని, నగదు బదిలీతో ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలన్నదే లక్ష్యమని రాష్ట్రపతి చెప్పారు. ద్రవ్యలోటును అధిగమించేందుకు ప్రభుత్వం ప్రణాళిచీ ూబద్ధంగా వ్యవహరిస్తోందన్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ సమస్యగానే ఉందన్నారు. ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం మనదేశంపైనా ప్రభావం చూపుతోందని ప్రణబ్‌ పేర్కొన్నారు. 2012-13లో వృద్ధి రేటు పదేళ్ల కిందటి కంటే కంటే తక్కువగా నమోదు కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది 6.2 శాతంగా ఉన్న వృద్ధి రేటు ఈసారి 5 శాతానికి కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ”గతేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రతికూలతలు ఎదుర్కొంది. దీని ప్రభావం మనపైనా పడింద్ణి అని చెప్పారు. ఈ నేపత్యంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు తగ్గుముఖం పట్టిందన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోందన్నారు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా 5.3 శాతం వృద్ధి రేటు సాదించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు చర్యలు చేపడుతున్నా.. ఇంకా సమస్యగానే ఉందన్నారు. గత మూడేళ్ల కంటే తక్కువగా ద్రవ్యోల్బణం 6.62 శాతంగా ఉందని చెప్పారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని.. న్యాయ జవవాబుదారీ బిల్లు తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.ప్రతికూల పరిస్థితులున్నా వ్యవసాయ ఉత్పత్తిలో ప్రగతి సాధిస్తున్నామన్నారు. యూరియా ఉత్పత్తిలో స్వావలంబన కోసం 100 లక్షల టన్నుల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించామని, 12వ పంచవర్ష ప్రణాళికలో 87 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఇందిరా ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణానికి రూ. 40 వేలనుంచి 70 వేలకు పెంచామన్నారు. జేఎన్‌ఎన్‌యూఆంఎం పథకం 2014 మార్చి వరకు పొడిగిస్తామని, గ్రావిూణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. 2022 నాటికి అన్ని గ్రావిూణ ప్రాంతాలకు రక్షిత మంచినీటి సరఫరా లక్ష్యమని వెల్లడించారు.
మహిళల భద్రతపై దృష్టి
మహిళల భద్రతపై దృష్టి పెడతామని ప్రణబ్‌ తెలిపారు. మహిళల భద్రత విషయంలో జ్టసిస్‌ వర్మ కమిటీ సిఫార్సులను ఆమోదించామని, మహిళలపై నేరాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు ఆర్డినెన్స్‌ జారీ చేశామని రాష్ట్రపతి తెలిపారు. సమగ్ర శిశు అభివృద్ధి పథకం కింద 12వ పంచవర్ష ప్రణాళికలో రూ. 1.23 లక్షల కోట్లు కేటాయించామన్నారు. నర్సుల కొరత తీర్చేందుకు దేశంలో 200 నర్సింస్త్ర కళాశాలలకు అనుమతిచ్చినట్లు చెప్పారు. ఉన్నత విద్య అభివృద్ధికి ప్రత్యేక పథకం ప్రారంభించామని, జాతీయ బాలల ఆరోగ్య పథకం కింద 2.70 కోట్ల మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, అసంఘటిత కార్మికుల కోసం జాతీయ ఆరోగ్య బీమా పథకం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. ఉత్పాదక రంగంలో 10 కోట్ల మందికి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాదుతో సహా ఆరు ఔషధ పరిశోధన సంస్థలు నెలకొల్పనున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు.
మనీ లాండరింస్త్ర చట్టానికి పదునుమనీ లాండరింస్త్ర చట్టానికి మరింత పదును పెడతామని, దేశీయ మారక ద్రవ్య అక్రమ తరలింపుపై ప్రత్యేక చర్యలు చేపట్టనున్నామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. 2,600 కి.విూ. రహదారుల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో కొత్తగా 42 ఓడరేవుల అభివృద్ధి, ఆంధప్రదేa, కోల్‌కతాలో 100 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కొత్తగా రెండు ఓడరేవుల నిర్మాణం చేపట్టను న్నామన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 88వేల మెగావాట్ల అదనపు ఉత్పత్తి లక్ష్యమని తెలిపారు. రాయ్‌బరేలీలో /టసెయిన్‌లెస్‌ /టసీల్‌ కోకల తయారీ కర్మాగారం నెలకొల్పనున్నామన్నారు. 1.30 లక్షల తపాలా కార్యాలయాలకు కంప్యూటర్లు సరఫరా చేస్తామని, 2014 నాటికి రెండున్నర లక్షల గ్రామాల్లో బ్రాాబ్యాాం సౌకర్యం కల్పిస్తామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. భారత టెలికాం రంగానికి ప్రపంచంలో రెండో స్థానం లభించిందని తెలిపారు. తూర్పు,పశ్చిమ కోస్తాలను కలుపుతూ ప్రత్యేక సరకు రవాణా రైలుమార్గం నిర్మించనున్నట్లు తెలిపారు.
వందేళ్ల సినిమాకు వందనం..
భారతీయ సినిమాకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా ముంబయిలో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటుచేస్తున్నట్లు రాష్ట్రపతి ప్రకటించారు. ఆంధప్రదేaలో కొత్తగా రెండు ఉత్పాదక మండళ్లు నెలకొల్పుతామని, జిల్లా, గ్రావిూణ స్థాయుల్లో క్రీడాకారులను గుర్తించేందుకు ప్రత్యేక పథకం ప్రవేశపెడతామని చెప్పారు. జమ్మూ కాశ్మీం, ఈశాన్య రాషాల్లో శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయని రాష్ట్రపతి చెప్పారు. తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న 34 జిల్లాల్లో 2015 నాటికి రూ. 7,300 కోట్లతో రహదారులు నిర్మిస్తామన్నారు. 10 లక్షల మంది చేనేత కార్మికులకు లబ్ది చేకూర్చేలా రాయితీ రుణ పథకం ప్రవేశపెడతామని చెప్పారు. దేశ సరహద్దు భద్రతకు సైన్యం సన్నద్ధంగా ఉందని, ఆయుధ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని, రక్షణ పరిశోధనల రంగంలో కొత్త ఆవిష్కరణలకు ప్రయత్నం జరుగుతోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. శ్రీలంకలో తమిళులకు శాంతియుతమైన జీవనాన్ని అందించేందుకు భార’ కృషి చేస్తుందన్నారు. శ్రీలంకలో తమిళుల పునరావాసం, హక్కుల పరిరక్షణకు నిబద్ధతతో ఉన్నామన్నారు. వేగంగా, పారదర్శకంగా పాస్‌ పోర్టు సేవలు అందించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. భారత- బంగ్లా సరిహద్దులో దీవుల స్వాధీన ఒప్పం దం అమలుకు రాజ్యాంగ సవరణ చేస్తామని, పశ్చిమ కనుమల్లోని కోయినాలో భూకంప అధ్యయన కేంద్రం ఏర్పాటుచేస్తామని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.