పారమితలో నూతన విధ్యా విధానానికి శ్రీకారం
స్థానిక మంకమ్మతోటలోని పారమిత పాఠశాలలో “ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కార్యక్రమం” ను పాఠశాల ఛైర్మన్ డా: ఇ. ప్రసాదరావు రావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఉపాధ్యాయుని, ఉపాద్యాయులు వారి శిక్షణా కార్యక్రమంలో అభ్యాసం చేసిన కృత్యాలను నాటకీకరణ రూపంలో ప్రదర్శించడం జరిగింది. అంతే గాక తరగతి గది వాతావరణాన్ని తలపించేలా ప్రాథమిక పాఠశాల విధ్యార్థులచే ఒక నాటికల ప్రదర్శనలు మరియు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న విధ్యార్థులను ఛైర్మన్ అభినందించారు .
ఈ సందర్భంగా పాఠశాల ఛైర్మన్ డా: ఇ. ప్రసాదరావు రావు మాట్లాడుతూ అన్ని సబ్జెక్టులకు సంభందించిన విషయాలను కలిపి ఒకే పాఠ్యంశం రూపంలో ప్రదర్షించి విధ్యార్థులకు అభ్యసనను సులభతరం చేసే విధంగా “ఇంటర్ డిసిప్లినరీ లెర్నింగ్ కార్యక్రమం” దోహదం చేస్తుందని వివరించారు. భవిష్యత్తులో విద్యార్థులలోని అభ్యసన వైకల్యాలను తొలగించడంలో ఈ నూతన విధానం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఇట్టి కార్యక్రమంలో పారమిత విధ్యాసంస్థల ఛైర్మన్ డాIIఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు , రశ్మిత, వినోదరావు, హనుమంతరావు, ప్రధానోపాద్యాయులు ప్రశాంత్, ఆనంద్ కమలాకర్, సమన్వయకర్తలు ఉపాధ్యాయుని , ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు