పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన
గోదావరిఖని: రామగుండం నగర పాలిక ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుడు భానేష్‌ను పర్యవేక్షులు తిరుపతి కొట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగారు. విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట బైఠాయించారు. నగర పరిపాలక అధికారుల జోక్యంతో ఇన్‌చార్జి తిరుపతి క్షమాపణ చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు.