పారిశుద్ధ్య కార్మికుల సమ్యెను దిక్కుమాలిన సమ్మె అంటారా?

3

– మండిపడ్డ వీహెచ్‌

– పలుచోట్ల నిరసన ప్రదర్శనలు

హైదరాబాద్‌,ఆగష్టు 9(జనంసాక్షి):

తెలంగాణ రాష్ట్రంలో పారిశుధ్య కార్మికులు చేపడుతు న్న సమ్మెపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్య లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దిక్కుమాలిన సం ఘాలు..దిక్కుమాలిన సమ్మెలు చేయిస్తున్నాయి అం టూ సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌ లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యు డు హనుమంతరావు ఆదివారం విూడియాతో మాట్లా డారు. మాట తీరు మార్చుకోవాలని హితవు పలికా రు. కేసీఆర్‌ ఎన్నో ఉద్యమాలు చేశారని, సఫాయి కా ర్మికులపై నీచంగా మాట్లాడడం తగదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను అవమానానికి గురి చేస్తున్నారని వీ హెచ్‌ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. ఇదిలా వుం డగా మున్సిపల్‌ కార్మికుల పట్ల కేసీఆర్‌ వైఖరికి నిర సనగా వామపక్షాలు తెలంగాణ వ్యాప్తంగా ఆం దో ళనలు నిర్వహించాయి. అన్ని

జిల్లాల్లోనూ కేసీఆర్‌ దిష్టిబొమ్మలను వామపక్ష నాయకులు దహనం చేశారు. కార్మికులు, కార్మిక సంఘాల పట్ల సర్కార్‌ తన వైఖరి మార్చుకోవాలని నాయకులు హెచ్చరించారు. గ్రామ పంచాయితీ, మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకోసం వెళ్లిన వామపక్ష, టీడీపీ, వైసీపీ నాయకులను అరెస్టు చేయించటాన్ని ఖండిస్తూ.. వామపక్షాలు తెలంగాణలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. అన్ని జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

హైదరాబాద్‌లో వామపక్ష నేతలను అరెస్ట్‌ చేయడాన్ని నిరసిస్తూ..నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేటలో కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. వామపక్షాల నిరసన కార్యక్రమాలకు టీడీపీ, వైసీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఖమ్మంలో పెవిలియన్‌ మైదానం నుంచి మున్సిపల్‌ కార్మికుల దీక్షాశిబిరం వరకూ వామపక్ష కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరపాలక సంస్థ ఎదుట కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కరీంనగర్‌ పట్టణం తెలంగాణ చౌక్‌లో సీపీఎం, సీపీఐ, టీడీపీ, వైసీపీ నేతలు ఆందోళన చేశారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సీపీఐ కార్యకర్త రాజుకు గాయాలయ్యాయి. మరో కార్యకర్తకు కాలు విరగడంతో పోలీసులపై నేతలు మండిపడ్డారు. తర్వాత రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా వామపక్ష నేతలు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. వరంగల్‌ నగరం పోచమ్మ మైదాన్‌ సెంటర్‌ వద్ద మున్సిపల్‌ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగాంలోనూ సీపీఎం, సీపీఐ, టీడీపీ నేతలు కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలో వామపక్ష నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిష్టిబొమ్మను ఊరేగించి.. దహనం చేశారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లా కేంద్రాల్లోనూ విపక్ష నాయకులు కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేసి.. నిరసన తెలిపారు.

ప్రతిపక్షాల మండిపాటు

ఊడ్చేవాళ్లే దేవుళ్లు అన్న సిఎం వారి జీతాలు పెంచడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. కార్మికులు, కార్మిక సంఘాలు, విపక్షాల పట్ల ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విపక్ష నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ఉద్యమ నేత కేసీఆర్‌ తన వైఖరిని మార్చుకోవాలని హెచ్చరించారు.