పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్
సానుకూలతతో ముందుకు వస్తున్న పరిశ్రమలు
హైదరాబాద్,ఆగస్ట్26 (జనం సాక్షి ) : తెలంగాణలో సత్వర పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న ఏకగవాక్ష విధానం సత్ఫలితాలు ఇస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరవాత వస్తున్న స్పందన బాగుందన్న అభిప్రాయంలో ప్రభుత్వం ఉంది. ఇక్కడి వాతావరణం, నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండడం కూడా కలసి వస్తోంది. ఇలా పారిశ్రామిక పెట్టుబడులకు భరోసా కల్పించారు. రాష్టాన్న్రి వేగంగా అభివృద్ధిపట్టాలపైకి ఎక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సూటిగానే చెప్పారు. ఇక్కడ ఉన్న వసతులు, అవకాశాలను వివరించి ఆకట్టుకుంటున్నారు. పరిశ్రమలకు అనుమతి ప్రకియను సరిళీకరిం చింది. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుమతుల జారీలో పారదర్శకత, జాప్యం నివారణ, సంబంధిత సంస్థలు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యహరించేలా కాలవ్యవధితో కూడిన కట్టుదిట్టమైన నిబంధనలను ప్రతిపాదించింది. ఇది అమల్లోకి రావడంతో పారిశ్రామిక అనుమతులకు ఏకగవాక్ష విధానం అనుకూలంగా ఉందని ఇటీవల కొన్ని పరిశ్రమలు అనుమతలు విషయాలను బట్టి తెలుస్తోంది. దీనివల్ల పరిశ్రమలు పెట్టాలనుకున్న వారికి పెద్దగా తలనొప్పులు ఉండబోవు. కార్యాలయాల చుట్టూ పరుగెత్తాల్సిన అవసరం రావడం లేదు. అదే సమయంలో పారిశ్రామికవేత్తలూ నిబంధనలకు బద్ధులయ్యేలా పలు జాగ్రత్తలు తీసుకొంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టు అనుమతి, స్వీయ ధ్రువీకరణ విధాన చట్టం` (టీఎస్‌ఐపాస్) ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది పారిశ్రామికవేత్తలను కూడా ఆకట్టుకునేలా ఉంది. అంతేగాకుండా వారు సైతం ఈ విధానాన్ని ఆహ్వానిస్తున్నారు. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించడం, పరిశ్రమలకు అనుమతులు ఒకే చోట మంజూరు చేసి, వాణిజ్య ఉత్పత్తులను వెంటనే ప్రారంభించేలా చేయడం దీని లక్ష్యంగా నిర్దేశించారు. ప్రభుత్వం ఈ విధానం ద్వారా పారదర్శకతను వెల్లడిరచింది. నోడల్ ఏజెన్సీలు ఇక చురుకుగా పనిచేస్తున్నాయి. దీంతో పారిశ్రామికవేత్తలకు సులువుగా అనుమతులు వస్తున్నాయి. భారీ పరిశ్రమలకు అనుమతుల మంజూరు కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పరిశ్రమల శాఖ కార్యదర్శి కన్వీనర్‌గా రాష్ట్ర పెట్టుబడులు, సదుపాయాల మండలి ఏర్పాటయ్యింది. రాష్ట్రస్థాయి పరిశ్రమల కమిటీ పంపే ప్రతిపాదనలను ఇది పరిశీలించి 15 రోజులలో సూతప్రాయ ఆమోదం తెలుపుతోంది. ఆ తర్వాత తుది అనుమతులిస్తుంది. పారిశ్రామికవేత్తలను ఆకర్షించి పెట్టుబడులను పెట్టేలా వాతావరణాన్ని సమకూర్చారు. ఒక్క దరఖాస్తు
చేసుకొని వెళ్లిపోతే మొత్తం అనుమతుల పక్రియకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని, పారిశ్రామికవేత్తల ఇంటికి వాటిని పంపిస్తామని గతంలోనే కెసిఆర్ వెల్లడిరచారు. ప్రపంచదేశాలతో పోల్చితే భారత్‌లో
పెట్టుబడులే లాభదాయకంగా ఉంటాయి. అందునా హైదరాబాద్‌లో పెడితే మరింత లాభదాయకంగా ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు.