పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదు: దానం నాగేందర్
హైదరాబాద్, జనంసాక్షి: పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదని కార్మిక శాఖ మంత్రి నాగేందర్ అన్నారు.
బుధవారమిక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుతున్న కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారని, వాటిని వెంటనే భర్తీ చేయాలని దానం నాగేందర్ కోరారు.