పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
తాండూరు : జిల్లాలో భాజపా బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్ అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో భాజపాకు అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలంగాణ విషయంలోనూ ప్రజలు భాజపానే విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల వరకు తెలంగాణ ప్రాంతంలో కూడా భాజపాను పటిష్ఠం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. ఆయనతోపాటు మండల అధ్యక్షుడు చిరంజీవి పలువురు నాయకులు ఉన్నారు.