పార్టీ విజయానికి కృషి చేస్తాం : మంత్రి దానం

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ విజయానికి కృషి చేస్తామని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. పార్టీ రాష్ట్రస్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాల్లో 20 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు.