పార్లమెంటును వీడని పెగాసస్‌ దుమారం


చర్చకు విపక్షాల పట్టు..ముందుకు సాగని సభలు
న్యూఢల్లీి,ఆగస్ట్‌10(జనం సాక్షి): పార్లమెంట్‌ ఉభయ సభలల్లో పెగాసస్‌ దుమారం కొనసాగుతోంది. దీనిపై చర్చకు విపక్షాలు పట్టువీడం లేదు. అయితే చర్చకు ప్రభుత్వం కూడా అంగీకరించడం లేదు. ఈ క్రమంలో మంగళవారం కూడా ఉభయసభలు తొలుత మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
పెగసస్‌పై చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారం కొలువుదీరాయి. వరుసగా 16వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవ్వగా.. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్టాల్రు తమ సొంత ఓబీసీ జాబితా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగిన ఓబీసీ సవరణ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబమమని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే ఓబీసీ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని 15 విపక్ష పార్టీల నిర్ణయం తీసుకున్నాయి. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సైతం తమ మద్దతు ప్రకటించింది. ఇకపోతే పోలవరంపై లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్‌ ఆమోదించాలని నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్‌ విప్‌ జారీ చేసింది. రాజ్యసభకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్టాల్ల్రో ఓబీసీ జాబితాను నిర్వహించే అధికారాన్ని రాష్టాల్రకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన
తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్టాల్ల్రోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం దక్కనుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. అయితే ఆ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు పాస్‌ కావడం అనివార్యమే అవుతుంది.

తాజావార్తలు