పార్లమెంటులో లఖింపూర్ ప్రకంపనలు
చర్చకు పట్టుబట్టిన విపక్షాలు
కేంద్రమంత్రిని తొలగించాలంటూ డిమాండ్
ఉభయ సభల్లో గందరగోళంతో వాయిదాపర్వం
న్యూఢల్లీి,డిసెంబర్15 (జనంసాక్షి):- లఖింపూర్ ఘటన పార్లమెంటును కుదిపింది. దీనిపై చర్చలకు విపక్షాలు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోలం చెలరేగింది. దీంతో ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రాను మంత్రిపదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లఖింపూర్ ఘటన కేసులో మంత్రి అజయ్‌ను తొలగించాలంటూ ఆయన ఇవాళ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ అంశం గురించి చర్చించాలని డిమాండ్ చేశారు. మంత్రి అజయ్ మిశ్రాను క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తామని లోక్‌సభ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరీ తెలిపారు. ముందస్తు కుట్రతోనే రైతులపైకి వాహనాన్ని తొక్కించినట్లు సిట్ దర్యాప్తు సంచలన విషయం వెల్లడిరచింది. ఈ ఘటన విషయంలో మరోసారి ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ అన్నారు. ఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాకాండపై సిట్ సంచలన విషయాలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో భాగమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్‌సభలో ఇవాళ విపక్ష సభ్యులు ఆ
అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. స్పీకర్ బిర్లా ఎంత వారించినా వాళ్లు వినలేదు. సభ్యులు మాస్క్ ధరించి తమ నిరసన వ్యక్తం చేయాలని మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. అయితే విపక్ష సభ్యులు పట్టించుకోలేదు. నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగిలారు. దీంతో స్పీకర్ బిర్లా సభను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. అంతకముందు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని తన తీర్మానంలో కోరారు. మరో వైపు 12 మంది ఎంపీలపై విధించిన వేటును ఎత్తివేయాలని కోరుతూ రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ
నేపథ్యంలో సభను 12 గంటల వరకు చైర్మెన్ వాయిదా వేశారు.