పార్లమెంటులో విపక్షాల ఆందోళన రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా.

8xohqoqrన్యూఢిల్లీ, ఆగస్టు 5 : పార్లమెంటు సమావేశాల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. బుధవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే వ్యాపమ్‌, లలిత్‌మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న సీఎంలు, కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. కాగా విపక్షాల ఆందోళనల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు.
రాజ్యసభలో మధ్యప్రదేశ్‌ రైలు ప్రమాదాల్లో మరణించిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు. మధ్యప్రదేశ్‌ రైలు దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రరైల్వేశాఖ మంత్రి సురేష్‌ ప్రభు మధ్యప్రదేశ్‌లో ప్రకటన చేశారు. అనంతరం ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి, సీఎంలు రాజీనామా చేయాలంటూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి నిరసనకు దిగారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభా కార్యాలపాలు కొనసాగేలా చూడాలని డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌ కోరినప్పటికీ సభ్యులు తమ ఆందోళనలను విరమించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.