పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి.

– సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం సిద్దార్థ రామ్మూర్తి.
బెల్లంపల్లి, సెప్టెంబర్28,(జనంసాక్షి)
పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుర్గం సిద్దార్థ రామ్మూర్తి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ భారత దేశ జ్ఞాన సంపదను గౌరవించుకొని పార్లమెంటు నూతన భవనానికి మేధావి అంబేద్కర్ పేరు పెట్టి దేశ ప్రతిష్టను పెంచి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దాం అన్నారు.