పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దాం.
ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో బిసి డిమాండ్లపై జాతీయస్థాయిలో ఉద్యమిస్తాం.
యువత రాజ్యాధికారం కోసం ఉద్యమించాలి.
బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు జులై 20(జనంసాక్షి)
పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ పార్లమెంట్లో సమావేశాలు ప్రారంభమైన దృష్ట్యా ఈసారైనా బీసీ బిల్లును ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో దాదాపు 60 శాతం వరకు బీసీలు ఉన్నారని, బీసీలకు కనీసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. గతంలో కాంగ్రెస్ టిఆర్ఎస్ వైఎస్ఆర్పి జనతాదళ్ యు జనతాదళ్ డి ఆకలిదళ్ బిఎస్పి సమాజ్వాది ఎఫ్ఎల్డి పిఎంకె ఆమ్ఆద్మీ నేషనల్ కాంగ్రెస్ శివసేన వంటి మొత్తం 14 పార్టీలు తీర్మానం చేశాయని గుర్తుచేశారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఆర్ కృష్ణయ్య గత నలభై సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారులేదంటే బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో గల్లి నుంచి ఢిల్లీ దాకా ఉద్యమాలు చెస్తామని హెచ్చరించారు. మరోవైపు తొలిసారి పార్లమెంట్లో బీసీల తరుపున గళం విప్పుతున్న బీసీ దళపతి ఆర్.కృష్ణయ్యకు హార్థిక
శుభాకాంక్షలు.తెలిపారు.