పార్లమెంట్‌లో మన తడాఖా చూపెడతాం

3

– హైకోర్టు కోసం స్తంభింపజేస్తాం

కరీంనగర్‌,జులై 6(జనంసాక్షి): హైకోర్టు విభజన జరిగేవరకూ పార్లమెంట్‌ సమావేశాలను స్తంభింపచేస్తామని ఐటీ శాఖమంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ తెలంగాణ సత్తా ఏంటో పార్లమెంట్‌లో చూపిస్తామన్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తే రాజకీయ పునాదులు కదులుతాయని కాంగ్రెస్‌, టీడీపీ నేతలు

అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ విమర్శించారు.తమది కూడా భూ నిర్వాసితుల కుటుంబమే అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి జానెడు జాగా కూడా ఏ ప్రాజెక్ట్‌లో పోలేదని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. నిర్వాసితులకు ఉండే బాధ జానారెడ్డికి తెలియకనే 123 జీవో ప్రకారం పరిహారాన్ని అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.