పార్లమెంట్ ఆవరణలో తృణమూల్ ఆందోళన
న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్లపై పరిమితి విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ అవరణలో ఆందోళన చేపట్టింది. పార్లమెంట్ ఒకటో గేటు ముందు ఆ పార్టీ సభ్యులు బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యునిపై అధిక భారం మోపే ఈ నిర్ణయాన్ని మన్మోహన్ సర్కార్ వెంటనే వెనక్కితీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు.