పార్లమెంట్ ఉభయసభలు 12 గంటలకు వాయిదా
ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు ఇదే అంశంపై అటు రాజ్యసభ కూడా మధ్యాహ్నానికి వాయిదా పడింది.