పార్లమెంట్ సమావేశాలు అతి ముఖ్యమైనవి
సమావేశాల సందర్బంగా విూడియాతో ప్రధాని మోడీ
న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి
: పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా జరుగుతాయని భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పార్లమెంట్ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని.. సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. వచ్చే 25 ఏళ్ల భవిష్యత్‌ను నిర్మించుకోవాల్సిన సమయమిదని పేర్కొన్నారు.
సభ్యులందరూ ఉభయసభల్లో లోతైన చర్చలు జరపాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఈ సమావేశా ల్లోనే కొత్త రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికవుతారని.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశాలను దేశప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్న మోదీ.. పార్లమెంట్‌లో చర్చలు, విమర్శలు అర్థవంతంగా జరగాలని ఆకాంక్షించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభ మయ్యాయి. అలాగే రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్‌లో విూడియాతో మాట్లాడుతూ ఇది ఆజాదీకా అమృత్ మహోత్సవ్ యుగమని అన్నారు. దేశంలో కొత్తశక్తిని పెంపొందించేందుకు.. పార్లమెంటు సభ్యులు మాద్యమంగా మారాలని పిలుపిచ్చారు. ఈ సెషన్‌ను దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుందామన్నారు. పార్లమెంటులో చర్చలు జరగాలని.. విషయాలను లోతుగా విశ్లేషించాలని మోదీ అన్నారు.