పాలకుర్తిని నంబర్‌వన్‌గా నిలబెట్టా: ఎర్రబెల్లి
జనగామ,సెప్టెంబర్15(జనంసాక్షి): రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేపట్టని అభివృద్ధి పాలకుర్తిలో చేపట్టేలా సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు అందించారని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఎర్రబెల్లి అన్నారు. సీడీఎఫ్ నిధులు నియోజకవర్గ అభివృద్ధికి 2017-2019వరకు రూ.3.99 కోట్లు కేటాయించి పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు రాష్ట్రంలో ఎదురులేదని, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని అనారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో తాను గెలవడం ఖాయమని, కార్యకర్తలు గ్రామాల్లో సైనికుల్లా పని చేయాలని సూచించారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలపై మాట్లాడితే ప్రజలు అడుగడుగునా నిలదీయాలన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించనున్నట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వాలూ చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారన్నారు. నియోజకవర్గన్ని అభివృద్ధిలో రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదన్నారు.