పాల‌కుర్తి సోమనాథ స్మృతి వ‌నంలో మొక్క‌లు నాటిన మంత్రి ఎర్ర‌బెల్లి

 వ‌రంగ‌ల్ : కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి సోమనాథ స్మృతి వనంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మొక్క‌లు నాటారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ద‌యాక‌ర్ రావు మాట్లాడుతూ.. హరితహారంలో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చ‌న కార్యక్రమం అద్భుతమైనది అని కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. హరితహారం వల్లే వాతావరణ సమతుల్యం ఏర్పడింది. సకాలంలో వర్షాలు పడుతుండ‌టంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారు. తెలంగాణకు ముందు చుక్క నీరు లేని పరిస్థితుల నుంచి నీరు ఇక చాలు అనే స్థాయికి వ‌చ్చాం. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయింది. హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ పెరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి పర్యావరణానికి పాటుపడాలి అని ద‌యాక‌ర్ రావు విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, జ‌డ్పీ సీఈఓ, డీఆర్‌డీవో, అటవీ, వివిధ శాఖల అధికారులు, మహిళలు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.