పాలకొల్లు లో రైతు భరోసా కార్యక్రమం

ఏలూరు,నవంబర్‌9(జనం సాక్షి) : ఏపీలో రైతు భరోసా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  రైతు భరోసా కార్యక్రమం కింద అర్హులైన ప్రతి రైతు, కౌలు రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. సొమ్ము జమ అవుతుందని నర్సాపురం సబ్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ చెప్పారు. శనివారం పాలకొల్లు తహసీల్దార్‌ కార్యాలయం
వద్ద రైతు భరోసా కార్యక్రమం కింద వివిధ కారణాలతో సొమ్ము పడని వారికి వెంటనే పరిష్కారం అయ్యేలా వివిధ గ్రామాలకు వివిధ అధికారులను కౌంటర్‌ గా ఏర్పాటు చేశారు. ప్రజాసాధికారిక సర్వే జరగకపోవడం, ఆధార్‌ బ్యాంకు లింక్‌ కాకపోవడం, నమోదులో తప్పులు.. ఇలా ఏ ఫిర్యాదు అయినా వెంటనే పరిష్కారం చేసేందుకు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కౌంటర్లను సబ్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాల్లో వ్యవసాయ శాఖ ఏడి ఎల్బీ సత్యనారాయణ, తహసీల్దార్‌, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, వివిధ గ్రామాల కార్యదర్శులు, వీఆర్వో, వీఆర్‌ఏ, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గన్నారు. సిబ్బంది కంటే ఫిర్యాదుదారులు తక్కువ ఉన్నారు.