పాలనాధికారి పర్యవేక్షణలో మన ఊరు మన బడి
నిర్మల్ బ్యూరో, జూన్30,జనంసాక్షి,,,, తెలంగాణ ప్రభుత్వము పాఠశాల లలో మౌలిక వసతుల కల్పనకు ప్రతిష్టత్మకముగా చేపట్టిన మన ఊరు మన బడి /మనబస్తి మన బడి పనులు జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ పర్యవేక్షణలో వేగముగా జరుగు చున్నవి. వివరాలలోకి వెలితె మన జిల్లలో మొత్తము 19 మండలాలకు సంబంధించి 735 పాఠశాలల నుండి 260 పాఠశాలల ను మన ఊరు మన బడి /మనబస్తి మన బడి క్రింద ఎంపిక చేయడము జరిగినది.
• ఇందులో ప్రాథమిక పాఠశాలలు 159
• ప్రాథమికోన్నత పాఠశాలలు 29
• ఉన్నత పాఠశాల లు 72
ఎంపిక చేసిన 260 పాఠశాల ల నుండి మొత్తం 234 పాఠశాలలు గ్రామీణ ప్రాంతానికి చెందినవి కాగా 26 పాఠశాల లు పట్టణ ప్రాంతానికి చెందినవి.పై పాఠశాల ల్లో 30 లక్షలకు పైగా అంచనా వేయబడిన పాఠశాలలు 82 కాగ, 30 లక్షల లోపు అంచనా వేయబడిన పాఠశాలలు 177. 30 లక్షల లోపు అంచనా ఉన్న 94 పాఠశాలలకు 15% డబ్బులు అడ్వాన్సు రూపంలో వారి ఎకౌంటు లో జమ చెయ్యడం కూడా జరిగింది. ఇందులో నుండి 85 పాఠశాలల్లో పనులు ప్రారంభం కూడా అయినాయి. మరియు అతి త్వరలో ఈ పనులు పూర్తి కూడా అవుతాయి. 30 లక్షల లోపు అంచనా వేయబడిన పాఠశాలల్లో 38 పాఠశాలలను మాడల్ పాఠశాలలుగా గుర్తించి వాటి పనులు కూడా త్వరలోనే పూర్తి చేసే దిశలో చర్యలు చేపట్టడం జరిగింది. మన ఊరు మనబడి/మన బస్తి మన బడి క్రింద గుర్తించిన 8 రకాల పనులపురోగతి ఈ క్రింది విధముగా ఉన్నవి
జిల్లాలలో శిథిలావస్థలో ఉన్న 121 పాఠశాలలలో నూతన గదులను నిర్మించడము జరుగుతుంది.
239 పాఠశాలలలో త్రాగు నీరు సౌకర్యాన్ని మెరుగుపరచడము జరుగుతుంది.
ఇప్పటి వరకు 13 పాఠశాలలలో ప్రహరిగోడల నిర్మాణము జరుగుచున్నది.
237 పాఠశాలలలో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరచడము జరుగుతుంది.
74 పాఠశాలలలో మధ్యాన్న భోజనానికి ప్రతేక గదులను నిర్మించడము జరుగుతుంది.
246 పాఠశాలలలో తరగతి గదులకు సంబందించిన చిన్న తరహ మరియు భారి మరమ్మతులను చేయడము జరుగుతుంది
15 పాఠశాల లలో మరుగుదొడ్ల నిర్మాణము మరియు మరమ్మతులు జరుగు చున్నవి.
9 పాఠశాలలలో మధ్యాన్న భోజనానికి సంబంధించి వంట గదులను నిర్మించడము జరుగుతుంది.
మన ఊరు మన బడి /మనబస్తి మన బడి పథకం లో ప్రధానోపాద్యాయులు కీలక పాత్ర పోషించాల్సి వుంటుంది కాబట్టి వీరికి తరచు మీటింగ్ లు పెట్టి వీరి బాధ్యతలను గుర్తుచెయ్యడం జరుగుతుంది.వీరు పాఠశాల యాజమాన్య కమిటీ లతో ఎప్పటికప్పడు సంప్రదిస్తూ వారి సూచనలు , సలహాలను స్వీకరిస్తు ,జరిగే పనులను పర్యవేక్షిస్తున్నారు.పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకుండా పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకోసం పాటు పడే విధంగా గ్రామస్తులను మరియు గ్రామా అభివృద్ధి కమిటి ల సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది.పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో పూర్వ విద్యార్ధుల పాత్ర ఎంతైనా వుంటుంది.కాబట్టి వారిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చెయ్యడం జరుగుతుంది.
Attachments area
|