పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం

` భవిష్యత్‌ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారు
` వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నది
` వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి స్వయంగా అయిల్‌ పామ్‌ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు
` వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజతో శంకుస్థాపన చేసిన మంత్రి
` రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖా మంత్రి  కేటీఆర్‌,
` వ్యవసాయం బలోపేతానికే పంటమార్పిడి: మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి బ్యూరో సెప్టెంబర్‌29 (జనంసాక్షి):పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలనీ అవుతుందని,భవిష్యత్‌ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.శుక్రవారం నాడువనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్‌ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమిపూజతో శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖామాత్యులు కేటీఆర్‌, పాల్గొన్న వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఎంపీలు మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, కార్పోరేషన్‌ చైర్మన్లు రజనీ సాయిచంద్‌, వాల్యా నాయక్‌, ఆంజనేయ గౌడ్‌ ,  జడ్పీ చైర్మన్‌ లోక్‌ నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్‌ అని, రైతు భీమాతో రైతు కుటుంబాలను ఆదుకుంటున్నది కేసీఆర్‌,పాలమూరు అంటే నాడు మైగ్రేషన్‌ నేడు ఇరిగేషన్‌ అని,పాలమూరు రంగారెడ్డితో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమని,భవిష్యత్‌ లో పాలమూరు రైతులు అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు.దూరదృష్టితో కేసీఆర్‌ ప్రత్యామ్నాయం పంటలను ప్రోత్సహిస్తున్నారని,సాంప్రదాయ పంటలతో రైతులు వ్యవసాయానికి దూరమయ్యే అవకాశం ఉందని గుర్తించి పంటల మార్పిడితో వ్యవసాయం బలోపేతం చేస్తున్నారని గుర్తు చేశారు.  ఒకనాడు చెరువు కింద చేను ఉంది అని చెప్పేది .. ఇప్పుడు చేను కిందకు చెరువు వచ్చింది అని తాడూరు మండలం ఐతోలు రైతు, ఎస్వీఎస్‌ యజమాని కృష్ణారెడ్డి చెప్పారని గుర్తు చేశారు.నాడు మనకు అందకుండా కిందకుపోయిన కృష్ణానీళ్లను బొట్టు బొట్టు ఒడిసిపట్టి రైతుల పొలాలకు మళ్లిస్తున్నామని,వ్యవసాయ మంత్రి నాయకత్వంలో ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధితో పాటు వ్యవసాయం బలోపేతమవుతున్నరు.తెలంగాణ ఏర్పాటుకు ముంది వరి ధాన్యం ఉత్పత్తి కేవలం 68 లక్షల మెట్రిక్‌ టన్నులే .. నేడు దాదాపు 3.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెరగడం గమనార్హం, ఇదే విషయం వరి ధాన్యం కొనమని చెప్పిన కేంద్ర మంత్రికి చెబితే అది ఎలా సాధ్యం అని అపహాస్యం చేశారన్నారు.మేమే ఖర్చు భరిస్తాం ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పామని అన్నారు.వరి మాత్రమే సాగు చేయడం భావ్యం కాదని,దేశంలో అవసరమైన 70 శాతం వంటనూనెలు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని,వరి ఉత్పత్తిలో దేశానికి దారి చూపినట్లే వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు తెలంగాణ దారి చూపాలని కేసీఆర్‌ ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నారు.అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని,వ్యవసాయ మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి స్వయంగా అయిల్‌ పామ్‌ సాగు చేసి ఆదర్శంగా నిలిచారు సాగులో కష్టనష్టాలు తెలుసుకుని ప్రభుత్వానికి చెప్పేందుకు వారు ముందుగా సాగుచేయడం అభినందనీయమన్నారు.14 కంపెనీలతో ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సాహం  అందుబాటులో ఫ్యాక్టరీలు నిర్మించి రైతులకు ప్రోత్సాహమిస్తామని హావిూ ఇచ్చారు.నాలుగేళ్లలో ఆయిల్‌ పామ్‌ పంట చేతికి వచ్చే వరకు అంతరపంటలు సాగు చేసుకోవచ్చు,ఏడాదికి లక్ష పై చిలుకు ఆదాయం ఆయిల్‌ పామ్‌ సాగుతో సాధ్యం, వరి సాగు నుండి రైతులు బయటకు రావాలి,ఆధునిక వ్యవసాయం వైపు మనందరం కలిసి నడవాలని,2601 రైతువేదికలతో వ్యవసాయ విస్తరణ అధికారులను అందుబాటులో ఉంచారు,కేసీఆర్‌ నాయకత్వంలో మూడో సారి అధికారం లోకి వస్తామని అన్నారు. మంత్రి నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి మళ్లీ గెలుస్తారు ఆయిల్‌ పామ్‌ ఫ్యాక్టరీల్లో స్థానికులకే ఉపాధి .. అవసరమైతే యువతకు ప్రభుత్వం నుండి నైపుణ్య శిక్షణ,ఆహారశుద్ది పరిశ్రమలకు పెద్ద పీట భవిష్యత్‌ లో తెలంగాణలో పెద్ద ఎత్తున యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయని అన్నారు. వ్యవసాయం బలోపేతానికే పంటమార్పిడి మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారని,అందులో భాగంగానే ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని, దేశంలో ఏటా 22 మిలియన్‌ టన్నుల నూనెలు అవసరం ఉందన్నారు.ఇందులో ఎక్కువమొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామని,ఆయిల్‌ పామ్‌ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పామని తెలిపారు.35 ఏళ్లలో 39 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగవుతున్నదని, గత రెండేళ్లలోపే లక్ష 22 వేల ఎకరాల్లో  కొత్తగా ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టామన్నారు. త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటామని వివరించారు. కోతులు, చీడపీడల బెడదలేని పంట ఆయిల్‌ పామ్‌ సాగు, ఆయిల్‌ పామ్‌ సాగు రైతుకు భరోసానిచ్చే క్రమంలో 40 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఫ్యాక్టరీ సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్నామని, ఫ్యాక్టరీకి అవసరమైన మేరకు ఆయిల్‌ పామ్‌ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తామన్నారు.వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమాతో పాటు వందశాతం కొనుగోళ్లు చేపట్టామని అన్నారు.వనపర్తి నియోజకవర్గం పెద్దమందడి మండలం బుగ్గపల్లి తండా వద్ద రూ.425 కోట్ల వ్యయంతో వనపర్తికి తాగు నీరు అందించే మిషన్‌ భగీరథ పథకాన్ని, రాజపేట సవిూపంలో రూ.5.08 కోట్లతో నిర్మించిన 96 డబల్‌ బెడ్రూం ఇండ్లు లబ్దిదారులకు అందజేసిన అనంతరం నాగవరం శివారులో రూ.2.80 కోట్లతో నిర్మించిన షాదీఖానా, వనపర్తి తెలంగాణ భవన్‌ (బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం)లో రూ.1.25 కోట్లతో నిర్మించిన భోజన శాల, రూ.75 లక్షలతో ఏర్పాటు చేసిన ఆచార్య జయశంకర్‌ పార్క్‌ ప్రారంభించి కాంస్య విగ్రహం ఆవిష్కరించి, రూ.1.02 కోట్లతో నిర్మించిన భూసార పరీక్ష కేంద్రం ప్రారంభించి, రూ.10 కోట్లతో నిర్మించే ఐటీ టవర్‌ కు శంకుస్థాపన చేసిన మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌ రెడ్డి, ఎంపీలు రాములు, శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిఅరెస్‌ అధ్యక్షుడు మున్సిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌,జిల్లా అధికార ప్రతినిధి మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, బిఅరెస్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వంగూర్‌ ప్రమోద్‌ కుమార్‌ రెడ్డి,జిల్లా విూడియా కన్వీనర్లు,యోగనందా రెడ్డి శ్యామ్‌ సోషల్‌ విూడియా కన్వీనర్‌ లు బిచూపల్లి యాదవ్‌,సునీల్‌ వాల్మీకి బిఅరెస్‌ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.