పాలిటెక్నిక్ కాలేజీల్లో తెలంగాణకు అన్యాయం
హైదరాబాద్, (జనంసాక్షి) : తెలంగాణపై సీమాంధ్ర ప్రభుత్వం మరోసారి తన బుద్దిని బయట పెట్టుకుంది. కొత్త పాలిటెక్నిక్ కాలేజీల కేటాయింపుల్లో తెలంగాణకు మరోసారి అన్యాయం చేసింది. ఇవాళ సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ పంపిన నాలుగు ప్రపోల్స్‌లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన రెండిరటిని ఆమోదించింది. తెలంగాణలో సిద్ధిపేట, సికింద్రాబాద్‌లో ప్రపోజల్స్‌లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటును తిరస్కరించింది. ఈ విషయంపై తులంగాణ వాదులు , టీఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా మండాపడుతున్నారు. ఈ వ్యవహారంపై తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.