పింక్ బాల్‌తో బంగ్లా ప్రాక్టీస్
డే అండ్ నైట్ మ్యాచ్ కోసం కసరత్తు
కోల్‌కతా,నవంబర్19 (జనంసాక్షి) : వరుస ఓటములతో కుంగిపోయిన బంగ్లా డే అండ్ నైట్ టెస్ట్‌కి ముమ్మర కసరత్తుచేస్తోంది. తాము ప్రాక్టీస్ చేస్తున్న విషయాన్ని ఆ జట్టు స్టార్ స్పిన్నర్ మెహదీ హసన్ వెల్లడించాడు. తేమని దృష్టిలో పెట్టుకొని పేసర్లు బంతిని నీటిలో ముంచి బౌలింగ్ చేస్తున్నారని అతను తెలిపాడు. ఇది మాకు ఓ కొత్త అనుభవం. ప్రతీ ఒక్కరు డే అండ్ నైట్ టెస్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మాకు ఎటువంటి ఒత్తిడి లేదు. నీళ్లలో బంతిని ముంచి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. తడిగా ఉన్నప్పుడు బంతి మరింత జారుతుందని నేను అనుకుంటున్నానని అతను అన్నాడు. రెడ్ బాల్ కంటే పింక్ బాల్ మరింత స్వింగ్ అవుతున్నట్లు తనకు అనిపించిందని అతను తెలిపాడు. నేను పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేశాను. అది రెడ్ బాల్ కంటే కాస్త ఎక్కువ స్వింగ్ అవుతుంది. పింక్ బాల్‌తో ప్రాక్టీస్ చేసేందుకు మాకు కావాల్సినంత సమయం దొరుకింది. దీంతో మేము మ్యాచ్ కోసం సిద్ధమవడం సులభంగా మారింది. బ్యాట్స్‌మెన్ పిచ్‌లో స్థిరపడితే.. ఎక్కువ పరుగులు చేసే అవకాశం ఉంది. స్పిన్నర్లు పింక్ బంతిని ఎక్కువ బౌన్స్ చేసే అవకాశం ఉంది. లైట్ల వెలుగులో ప్రాక్టీస్ చేస్తున్నాం.. అన్ని విధాలుగా మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నామని అతను పేర్కొన్నాడు.