పిచ్చిఆలోచనలతో రెచ్చిపోకు… (పార్టు…2)

కొన్ని…పిచ్చి ఆలోచనలు
గుండెల్ని పిండిచేస్తాయి పిప్పిచేస్తాయి
ఆ పిచ్చిఆలోచనలే రగిలే అగ్నిపర్వతాలై
బ్రద్ధలై “విషాదపులావాను” విరజిమ్ముతాయి

అందుకే
చేయకు చేయకు
పిచ్చి ఆలోచనలతో
నీ విలువైన
కాలాన్ని వృధాచేయకు…అవి
నీ ఆరోగ్యాన్ని…
నీ ఆదాయాన్ని…
నీ ఆయుష్షును….
నీకు దూరం చేస్తాయి…
నీ బ్రతుకును అంధకారం చేస్తాయి.

ఆపై…..నీకు బంధాలు…భారమౌతాయి
దూరమౌతాయి మటుమాయమౌతాయి
ఇక మిగిలేది…
ఒంటరితనమే…
తరగని మానసిక క్షోభే…
భరించలేని ఒత్తిడే…అది వర్ణనాతీతమే…

ఆపై…ఏవేవో మానసివ్యాధులు
కనపడవు కానీ వేధిస్తాయి బాధిస్తాయి
“బలహీనతలకు నిన్ను బానిసను” చేస్తాయి

ఔను ఆ పిచ్చి ఆలోచనలకు “ఆనకట్టలు” కట్టాలి
పిచ్చిఆలోచనల “కలుపుమొక్కలను” తొలిగించాలి
మదినిండా “మంచితనం మానవత్వం”
పరిమళించే “ప్రేమమొక్కల్ని” పెంచాలి

అందుకే మిత్రులారా మరువకండి !
విరుద్దమైన…”ఆలోచనలే విషమని”…
అనురాగపూరిత…”ఆలోచనలే అమృతమని”…
ఆగని పాపిష్టి…”ఆలోచనలే ఆరని నిప్పని”…
దుష్టతలంపులే…”ముందున్న ముప్పుకు మూలమని”…

రచన:
“కవి రత్న”
“సహస్ర కవి”
పోలయ్య కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్
చరవాణి…9110784502