పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి
జమ్మికుంట గ్రామీణం : మండలంలోని మాచినపల్లి గ్రామంలో ఈ తెల్లవారుజామున పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. గ్రామానికి చెందిన కొమురయ్య (35), అతని మామ లింగయ్య గొర్రెల మందతో గ్రామ శివారులోకి వెళ్లారు. పిడుగుపడటంతో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందగా లింగయ్యకు గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని అధికారులు పరిశీలించారు.