పినాకా`ఈఆర్ రాకెట్ పరీక్ష సక్సెస్
పోక్రాన్,డిసెంబరు 11(జనంసాక్షి): పినాకా రాకెట్ వ్యవస్థకు చెందిన ఎక్స్టెండెడ్ రేంజ్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గత మూడు రోజుల నుంచి దశల వారీగా విజయవంతంగా టెస్టింగ్ సాగుతోంది. పోక్రాన్ ఫీల్డ్ రేంజ్లో ఈ టెస్టింగ్ జరిగింది. డీఆర్డీవో టెక్నాలజీ సాయంతో ప్రైవేటు ఇండస్ట్రీ ఆ రాకెట్ వ్యవస్థను డెవలప్ చేసింది. వివిధ రకాల సామర్ధ్యం ఉన్న వార్‌హెడ్స్ తో పినాకా రాకెట్లను పరీక్షించామని, అన్ని ట్రయల్స్‌లోనూ సంతృప్తికరంగా ఫలితాలు వచ్చినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పినాకా ఎంకే`ఐ రాకెట్ వ్యవస్థ సుమారు 40 కిలోవిూటర్ల ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేయగలదు. అలాగే పినాకా`2 వేరియంట్ 60 కిలోవిూటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చిత్తు చేస్తుంది. ఇక పినాకా`ఈఆర్ రేంజ్‌ను మాత్రం ఇంకా వెల్లడిరచలేదు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్లపై 24 రాకెట్లను పరీక్షించినట్లు తెలిపారు.