పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలి

మహాబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్2 (జనంసాక్షి)

జిల్లాలో 1-19 సంవత్సరాల లోపు పిల్లలందరికి తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలను ఇచ్చి నులిపురుగులను నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ కె.శశాంక అధికారులను ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో విద్యా, వైద్య సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15న జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లాలో 2లక్షల 40వేల 971 మంది 19 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్నారని వారందరికీ తప్పనిసరిగా ఆల్బెండ జోల్ మాత్రలు అందించాలని దీనికి గాను విద్యా ,వైద్యా, సంక్షేమ జిల్లా ,మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో సమగ్ర ప్రణాళికతో ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ నెల 15 వ తేదీతో పాటు ఈ నెల 22 వ తేదీన రెండు రోజుల పాటు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం గా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యా ఆరోగ్య శాఖాధికారి డా.హరీష్ రాజ్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నర్మదా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్యా, జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై,ప్రోగ్రాం అధికారి రాజేంద్రప్రసాద్ మెడికల్ ఆఫీసర్లు, సీడీపీవోలు, మండల విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.