పిల్లల్లో దేశభక్తి భావాన్ని ప్రోత్సహించాలి.
– ఎస్ఐ విజయ లక్ష్మి
చండ్రుగొండ జనంసాక్షి(ఆగస్ట్ 22) : విద్యార్థి దశ నుండే పిల్లల్లో దేశభక్తి భావాన్ని ప్రోత్సహించాలని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి అన్నారు. వజ్రోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ప్రతిభ విద్యాలయంలో చదివే చిన్నారులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణతో పాఠశాల ప్రాంగణం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఐ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహించాలన్నారు. చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ చాక్లెట్లు బిస్కెట్లను పంచి పెట్టారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల వేషధారణ చూసుకుంటూ మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఖాజాహుసేన్,ఉపాధ్యాయురాలు పర్వీన్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.