పీఆర్సీ బకాయిలు చెల్లించాలి
మెదక్,ఏప్రిల్5(జనంసాక్షి): పీఆర్సీ బకాయిలను జీపీఎఫ్‌లో కలపాలని , భాషా పండితులు, పీఈటీ పోస్టులను వెంటనే అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులివ్వాలని డీటీఎఫ్ జిల్లా నాయకులు అన్నారు. రేషనలైజేషన్ పేరిట పాఠశాలలను కుదించడం, ఎత్తేయడం వల్ల గ్రావిూణ పేద విద్యార్థులు నష్టపోయే అవకాశముందని ఆవేదన చెందారు. రేషనలైజేషన్ పేరిట ప్రభుత్వ పాఠశాలల కుదింపును మానుకోవాలని డిమాండు చేశారు. గత ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలనే తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా రేషనలైజేషన్ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా పాఠశాలలను పెంచి ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వాలు దానిని విస్మరించడం తగదన్నారు. మార్చి 21 నుంచే విద్యా సంవత్సరాన్ని ప్రారభించినట్లు ప్రభుత్వం ప్రకటించాలని అన్నారు.