పీఎం కిసాన్, ఈ కేవైసీ లను వెంటనే నమోదు చేసుకోవాలి ఏడిఏ నాగమణి

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో రైతులందరూ పీఎం కిసాన్,  ఈ కేవైసీలను వెంటనే నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు  పోరెడ్డి నాగమణి కోరారు.  శనివారం స్థానిక రైతు వేదిక నందు నిర్వహించిన డివిజన్ సాయి వ్యవసాయ విస్తరణ శాఖ అధికారుల సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడుతూ రైతులందరూ తమ యాజమాన్య హక్కులను నమోదు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని  అనుకోరారు. అదేవిధంగా పిఎం కిసాన్, ఈ కేవైసీలు నమోదు చేసుకోకుంటే 12వ విడత రైతు బంధు డబ్బులు జమ కావడంలో జాప్యం జరుగుతుందని తెలియజేయాలని  కోరారు. ఈ పిఎం (Pmkisan) ఈ (EKYC) చేసుకోవాల్సిన రైతులు అందరికీ కూడా సమాచారం అందించి వెంటనే చేసుకోవాల్సిందిగా సూచించారు. అదేవిధంగా పంట నమోదు కార్యక్రమాన్ని కూడా వెంటనే మొదలు చేయాలని సూచించారు. దురదృష్టవశాత్తు చనిపోయి రైతు బీమా కలిగివున్న రైతుల వివరాలు రెండు నుంచి మూడు రోజులలో డెత్ రికార్డు చేయాలని కోరారు. చనిపోయినటువంటి రైతులకు సంబంధించిన వారు చనిపోయిన వారి వివరాలు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి వెంటనే తెలుపగలరని కోరారు.ఈ కార్యక్రమంలో బి . కళ్యాణ్ చక్రవర్తి మండల వ్యవసాయ అధికారి మిర్యాలగూడ మరియు డివిజన్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.