పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 90.28 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను ఓయూ ఉపకులపతి సత్యనారాయణ ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు. పీజీ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి జూన్‌ 23నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. 16 సబ్జెక్టుల్లో పరీక్షకు 91.467 మంది విద్యార్థులు హాజరవగా 82,576 మంది ఉత్తీర్ణులయ్యారు.