పుట్ట దంపతుల చిత్రపటానికి పాలాభిషేకం

మంథని, జనంసాక్షి, ఫిబ్రవరి 09 : మంథని-బోయిన్ పేట్ ల మధ్య అభివృద్ధి నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆరు నెలలకాలంలో యుద్ధ ప్రాతిపదికన ముత్యంపాయ కాలువపై రూ. 42 లక్షల వ్యయంతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయించిన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మంథని మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజల చిత్రపటాలకు 6వ వార్డ్ కౌన్సిలర్ కాయితి సమ్మయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కాయితి సమ్మయ్య మాట్లాడుతూ.. మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేట్ లో అభివృద్ధికి బాటలు వేస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధుకర్ కు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ కు కృతజ్ఞతలు తెలుపుతున్నమన్నారు. ఈ వంతెన నిర్మాణంతో బోయిన్ పేట వాసులు మంథని కి వెళ్లేందుకు మార్గం సులువైందన్నారు. బోయిని పేట పరిధిలో 6 కోట్ల రూపాయలతో